ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 2:39 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాల రక్షణకు బీఆర్ఎస్ పోరాటం.

కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాల రక్షణకు బీఆర్ఎస్ పోరాటం.

జన్నారం ప్రతినిధి:అర్జున్ సమాచారం ఆగస్టు 17:

బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలకు ఆర్థిక అండ లభించి, వారి జీవితాల్లో వెలుగులు నింపింది.

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, వాటిని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని నిరసిస్తూ, ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ భూక్య జాన్సన్ నాయక్ గారి ఆదేశాల మేరకు, ఈరోజు జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి, జన్నారం మండల బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వో గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి జాప్యం లేకుండా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుర్రం రాజారాం రెడ్డి గారు సెక్రెటరీ సులువ జనార్దన్ గారు మరియు జన్నారం మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.